ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైక్‌లు

by Ratna Kumari |

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం నిజాంసాగర్–మహమ్మద్‌నగర్ జాతీయ రహదారి NH-765Dపై చోటుచేసుకుంది.

ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైక్‌లు
X

దిశ, నిజాంసాగర్ : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం నిజాంసాగర్–మహమ్మద్‌నగర్ జాతీయ రహదారి (NH-765D)పై చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజు తన కుమార్తె శ్రీవాణిని వైద్య చికిత్స కోసం శనివారం ఉదయం ద్విచక్ర వాహనం (TS16EF6425)పై మహమ్మద్‌నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, బాన్సువాడ నుంచి మహమ్మద్‌నగర్ వైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనం (TS10EY7388) ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కుమ్మరి రాజు, ఆయన కుమార్తె శ్రీవాణి తీవ్రంగా గాయపడగా, మరో బైక్‌ను నడుపుతున్న అన్నాసాగర్ గ్రామానికి చెందిన పెద్దగోళ్ల సందీప్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌ఐ శివకుమార్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుమ్మరి రాజు భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Next Story