కాశీబుగ్గ సీఐ రామకృష్ణపై చర్యలు.. వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పరిధి పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాశీబుగ్గ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణతో పాటు, అక్కడే పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ సునీల్‌కుమార్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ...

కాశీబుగ్గ సీఐ రామకృష్ణపై చర్యలు..  వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పరిధి పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాశీబుగ్గ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణతో పాటు, అక్కడే పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ సునీల్‌కుమార్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఈ ఇద్దరిని తక్షణమే బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిద్దరినీ విధులకు దూరం చేస్తూ వ్యాకన్సీ రిజర్వ్‌కు పంపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఇద్దరూ వెంటనే విశాఖపట్నంలోని రేంజ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విధుల నిర్వహణలో సదరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తడంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం స్థానిక పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story