విజయవాడలో డయేరియా కలకలం.. 13 మందికి అస్వస్థత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-18 09:17:07  IST  )

విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం రేగింది. కలుషిత నీరు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు...

విజయవాడలో డయేరియా కలకలం.. 13 మందికి అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం రేగింది. కలుషిత నీరు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో 10 మంది సురక్షితంగా డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురికి వైద్యం కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. గిరిపురంలో అధికారులు పర్యటించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లి స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాగునీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. నీటి నాణ్యతపై పీఎంసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గిరిపురం ప్రాంతంలో అంతా కూలీ పనులు చేసుకునే వాళ్లమని నల్లా నీళ్లపైనే 90 శాతం ప్రజలు ఆధారపడి బతుకున్నామని, డ్రైనేజీ నీళ్లు కలవడం వల్లే అస్వస్థతకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు కూడా విపరీతంగా ఉన్నాయని తెలిపారు. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంలేదని వాపోయారు.

Next Story