- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టరేట్‌లో 'వీఐపీ' టాయిలెట్లకు తాళం..
జగిత్యాల ఐడీఓసీ కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్ ఎదురుగా ఉన్న టాయిలెట్లకు అధికారులు తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది.

దిశ, జగిత్యాల కలెక్టరేట్: జగిత్యాల ఐడీఓసీ కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్ ఎదురుగా ఉన్న టాయిలెట్లకు అధికారులు తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు వినియోగించేందుకు ఏర్పాటు చేసిన టాయిలెట్లను మూసివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని టాయిలెట్లను కాకుండా, మీటింగ్ హాల్ ఎదురుగా ఉన్న టాయిలెట్లకు మాత్రమే తాళం వేయడం గమనార్హం. మిగిలిన టాయిలెట్లు యథావిధిగా ప్రజల వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. ఈ విషయమై కలెక్టరేట్ ఏవో కిషాన్ ను వివరణ కోరగా.. అవి వీఐపీ టాయిలెట్లు అని, వాటిని కొందరికి ఎలా వినియోగించాలో తెలియకపోవడం వినియోగించిన తర్వాత ఫ్లష్ చేయకపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోందని తెలిపారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతున్నారని, ఆ కారణంగానే తాత్కాలికంగా ఆ టాయిలెట్లకు మాత్రమే తాళం వేసినట్లు వెల్లడించారు. అయితే ప్రజల సౌకర్యార్థం నిర్మించిన టాయిలెట్లను మూసివేయడం కంటే వాటి నిర్వహణను మెరుగుపరచాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.






