- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతరిక్ష రంగంలో విక్రమ్-1 సరికొత్త మైలురాయి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
దేశపు తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' విజయవంతమైన లాంచ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.. స్కైరూట్, ఇస్రో బృందాలకు ప్రత్యేక అభినందనలు!

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని శ్రీహరి కోట వేదికగా జరిగిన ప్రయోగంలో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన ఈ ప్రయోగం.. అంతరిక్ష సాంకేతికత, ఆవిష్కరణలలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలిపే దిశలో ఒక సరికొత్త మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఈ అద్భుత ఘట్టాన్ని సాకారం చేసిన స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో (ISRO), ఇన్-స్పేస్ (IN-SPACe) బృందాలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ధీరత్వానికి, పట్టుదలకు నిదర్శనం – పవన్ కళ్యాణ్..
ఈ ప్రయోగంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. "ప్రతి తరం తాము దాటడానికి సాహసించిన సరిహద్దుల ద్వారానే గుర్తుండిపోతుంది. నేడు భారతదేశం అంతరిక్ష రంగంలో అటువంటి సరికొత్త సరిహద్దును చేరుకుంది. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యానికి తెరిచి, నూతన ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విప్లవాత్మక దార్శనికతకు ఈ మిషన్ ఒక నిదర్శనం" అని పేర్కొన్నారు. ఈ మిషన్ కేవలం రాకెట్ ప్రయోగం మాత్రమే కాదని.. భారతీయ ప్రతిభ, శాస్త్రీయ నైపుణ్యం, పారిశ్రామిక స్ఫూర్తి మరియు సాహసోపేతమైన ఆలోచనలను చారిత్రాత్మక విజయాలుగా మార్చగల ఆత్మ విశ్వాసానికి ప్రతీక అని కొనియాడారు. ధైర్యం, ఆవిష్కరణ, పట్టుదల ఉంటే భారతీయులకు ఏ సరిహద్దు కూడా అసాధ్యం కాదనే శక్తివంతమైన సందేశాన్ని ఈ విజయం యువతకు అందించిందని, ఇది రాబోయే తరాలకు పెద్ద కలలు కనేందుకు, సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు గొప్ప స్ఫూర్తినిస్తుందని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.






