ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి: ఏఈఓ సంతోష్

by Jakkula.Mamatha |

వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని శనివారం మండలంలోని బండల ఖానాపూర్, పొన్కల్ గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో ఆరుతడి పంటలు, ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి: ఏఈఓ సంతోష్
X

దిశ, మామడ: వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని శనివారం మండలంలోని బండల ఖానాపూర్, పొన్కల్ గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో ఆరుతడి పంటలు, ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని, ఎకరానికి 50 మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటిన నాలుగేళ్ల అనంతరం ఎకరానికి 8 నుంచి 12 టన్నుల కాయల దిగుబడి వస్తాయని ఆయన పేర్కొన్నారు. నీటిని నిల్వ చేయడానికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Next Story