మురికి కాల్వలో పడి వ్యక్తి మృతి

by Ratna Kumari |

బీర్కూర్‌లో మురికి కాల్వలో పడి సంగెం విఠల్ (39) మృతి చెందగా, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మురికి కాల్వలో పడి వ్యక్తి మృతి
X

దిశ, బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. సంగెం విఠల్ (39) అనే వ్యక్తి మురికి కాల్వలో పడి మృతి చెందాడు. మృతుడి సోదరి నూకల సత్యవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రాములు తెలిపారు. విఠల్ మురికి కాల్వలో ఎలా పడ్డాడు, ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story