రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన.. రూ.500 పోయాయని విద్యార్థినుల దుస్తులు విప్పించిన టీచర్

by Ajay Maddhiboyina |

రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన రూ.500 నోటు పోయిందని ఓ టీచర్ విద్యార్థినులు దుస్తులు విప్పించి మరీ వెతికింది. విద్యార్థులు ఎవరైనా అందుకు నిరాకరిస్తే తనకు రూ.500 ఇచ్చి వెళ్లిపోవాలని కండిషన్ పెట్టింది.

రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన.. రూ.500 పోయాయని విద్యార్థినుల దుస్తులు విప్పించిన టీచర్
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన రూ.500 నోటు పోయిందని ఓ టీచర్ విద్యార్థినులు దుస్తులు విప్పించి మరీ వెతికింది. విద్యార్థులు ఎవరైనా అందుకు నిరాకరిస్తే తనకు రూ.500 ఇచ్చి వెళ్లిపోవాలని కండిషన్ పెట్టింది. విద్యార్థులు ఈ విష‌యం త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డంతో టీచ‌ర్ దుశ్చ‌ర్య బ‌య‌ట‌ప‌డింది. వివ‌రాల్లోకి వెళితే.. రాజ‌స్థాన్ రాష్ట్రంలోని స‌వాయి మాధోపూర్లోని ప్ర‌భుత్వ సెకండరీ పాఠ‌శాల‌లో సరస్వతి మీనా అనే ఉపాధ్యాయురాలు స్కూల్ లో తన రూ.500 నోటు పోయిందని విద్యార్థులను అనుమానించింది. తాను 9,11వ తరగతి విద్యార్థులకు బోధించడంతో ఆ క్లాసుల వాళ్లే తన డబ్బులు తీసుకుని ఉంటారని అనుమానించి వెతకడం ప్రారంభించింది.

విద్యార్థుల బ్యాగులు, పర్సులు మాత్రమే కాకుండా అమ్మాయిల దుస్తులు విప్పి డబ్బులు వెతకడం వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా దుస్తులు విప్పేందుకు ఎవరైనా నిరాకరిస్తే రూ.500 ఇచ్చి వెళ్లిపోవచ్చని కండిషన్ పెట్టింది. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆవేదన వ్యక్తం చేయడంతో వారు స్కూల్ ముందుకు వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్ల‌డంతో వారు టీచ‌ర్ ను స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ వార్త వైర‌ల్ అవ్వ‌డంతో టీచ‌ర్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story