యూట్యూబర్ రావణ్ రిమాండ్ పొడిగింపు

by Vemula.Srinu Prasad |

యూట్యూబర్ రావణ్ రిమాండ్ గడువును కోర్టు మరోసారి పొడిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువు ముగియడంతో రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టారు..

యూట్యూబర్ రావణ్ రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబర్ రావణ్(YouTuber Ravan) రిమాండ్ గడువును కోర్టు మరోసారి పొడిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువు ముగియడంతో రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టు(Gannavaram Court)లో ప్రవేశపెట్టారు. దీంతో రావణ్ రిమాండ్ గడువును పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆయనను పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు.

ఇదే కేసులో...

మరోవైపు ఇదే కేసులో మరో యూట్యూబర్ గమన, ఇంద్రసేనాచౌదరిని గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో విచారించారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా ఈ రోజు వారిని ప్రశ్నించారు. గత రెండు రోజులుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. గమనతో పాటు ఇంద్రసేనా చౌదరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్ ఛానెళ్ల నిర్వహణ, ప్రోద్భలం, ఆర్థిక లావాదేవీలు, విద్వేషపూరిత వీడియోలపైనా ఆరా తీశారు.

Next Story