బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొని యువకుడు మృతి

by Taduka Kalyani |

బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నంగునూరు మండలం సిద్దన్నపేట స్టేజి వద్ద జరిగింది.

బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొని యువకుడు మృతి
X

దిశ, నంగునూరు: బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నంగునూరు మండలం సిద్దన్నపేట స్టేజి వద్ద జరిగింది. నంగునూరు మండలం జీపీ తండా గ్రామానికి చెందిన భూక్యా గణేష్ నాయక్ (27) బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు గుర్తించి సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో గణేష్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story