- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Spicejet: స్పైస్‌జెట్‌కు సీసీపీఏ షాక్
డార్క్ ప్యాటర్న్స్ ఉపయోగించినందుకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) భారీ జరిమానా విధించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన ఫ్లైట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో మోసపూరిత డిజైన్ పద్ధతులను (డార్క్ ప్యాటర్న్స్) ఉపయోగించినందుకు, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) భారీ జరిమానా విధించింది. విమాన టికెట్ బుకింగ్ సమయంలో వినియోగదారుల స్పష్టమైన అనుమతి లేకుండానే వారిని స్పైస్‌క్లబ్ లాయల్టీ ప్రోగ్రామ్‌లో చేర్చడం, అలాగే ప్రమోషనల్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు, ఈ-మెయిళ్లు పంపేందుకు ముందుగానే అంగీకారం తీసుకున్నట్లు చూపించడం వల్ల సీసీపీఏ స్పైస్‌జెట్‌పై రూ. లక్ష జరిమానా విధించింది. సంస్థ వెబ్‌సైట్‌లో ముందే టిక్ చేసిన చెక్‌బాక్స్‌లను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఎంపికను ప్రభావితం చేసినట్లు సీసీపీఏ గుర్తించింది. నోటీసు జారీ చేసిన తర్వాత కూడా పాత చెక్‌బాక్స్‌ను తొలగించి మరో ప్రీ-టిక్ చెక్‌బాక్స్‌ను చేర్చడం ద్వారా అదే విధానాన్ని కొనసాగించిందని కూడా పేర్కొంది.
తన ఉత్తర్వులో సీసీపీఏ, స్పైస్‌జెట్ ప్లాట్‌ఫామ్‌లో బలవంతపు చర్య (ఫోర్స్‌డ్ యాక్షన్), ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫెరెన్స్, 'మోసపూరిత ప్రశ్నలు అనే మూడు రకాల డార్క్ ప్యాటర్న్స్ ఉన్నట్లు నిర్ధారించింది. ముందే టిక్ చేసిన బాక్స్‌లు లేదా డిఫాల్ట్ సెట్టింగ్‌ల ద్వారా పొందిన అంగీకారం చట్టబద్ధమైన సమ్మతిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇది వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఈ-కామర్స్ నిబంధనలు-2020, అలాగే డార్క్ ప్యాటర్న్స్ మార్గదర్శకాలు-2023కు విరుద్ధమని పేర్కొంది. విచారణలో ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందని స్పైస్‌జెట్ వివరణ ఇచ్చినప్పటికీ, లోపాలను పూర్తిగా సరిచేసి అవి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు హామీ ఇవ్వాలని సీసీపీఏ ఆదేశించింది.






