పోలవరం జిల్లాలో విషాదం.. ఇద్దరు మత్య్సకారుల మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-18 08:38:46  IST  )

పోలవరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి చేపలు వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. మరో ముగ్గురు గోదావరిలో గల్లంతయ్యారు...

పోలవరం జిల్లాలో విషాదం.. ఇద్దరు మత్య్సకారుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపలు వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. మరో ముగ్గురు గోదావరిలో గల్లంతయ్యారు. దీంతో వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఐదుగురు మత్య్సకారులు ఈ రోజు ఉదయం గోదావరిలో చేపలవేటకు వెళ్లారు. అయితే గోదావరి మధ్య ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మత్య్సకారులు గోదావరి నీటిలో మునిగిపోయి మృతి చెందారు. మరో ముగ్గురు గోదావరి ఉధృతిలో కొట్టుకుపోయారు. దీంతో స్థానికులు అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నారు. ఇద్దరు మత్స్యకారుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Next Story