దేవదాయ శాఖ భూములు కబ్జా.. అధికారులపై కారం, పెట్రోల్‌తో దాడి

by Malleboina Mahesh |

మంచిర్యాల జిల్లా చెన్నూరులో దారుణం.. దేవాలయ భూముల కబ్జా అడ్డుకునేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ అధికారులపై కారంపొడి, పెట్రోల్‌తో దాడి!

దేవదాయ శాఖ భూములు కబ్జా.. అధికారులపై కారం, పెట్రోల్‌తో దాడి
X

దిశ, వెబ్ డెస్క్: దేవాలయ భూములను కాపాడేందుకు వెళ్లిన అధికారులపై కారం, పెట్రోల్ చల్లి దాడికి పాల్పడటం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ షాకింగ్ సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. చెన్నూరులో దేవదాయ శాఖ భూముల కబ్జాకు గురయ్యాయని తెలుసుకున్న అధికారులు.. ఆ భూమి స్వాధీనం చేసుకోవడానికి వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అధికారులపై ఆగ్రహం తో ఊగిపోతూ.. కారంపొడి, పెట్రోల్ తో దాడికి పాల్పడ్డారు. దీంతో అధికారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story