షూటింగ్ ప్రారంభానికి ముందే అంచనాలు పెంచే ప్లాన్ చేసిన నితిన్ కొత్త మూవీ మేకర్స్

by Pulgam srinivas |

నితిన్–మురళికాంత్ కాంబో మూవీ గ్లింప్స్ వీడియో చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతున్నట్లు సమాచారం.

షూటింగ్ ప్రారంభానికి ముందే అంచనాలు పెంచే ప్లాన్ చేసిన నితిన్ కొత్త మూవీ మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రాము–సోము దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే దండోరా ఫేమ్ మురళికాంత్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా ఆయన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించనున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే గ్లింప్స్ లేదా కాన్సెప్ట్ వీడియోలను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడం మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహంగా మారింది.

ఇదే ఫార్ములాను నితిన్–మురళికాంత్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. అది పూర్తైన వెంటనే గ్లింప్స్‌ను విడుదల చేస్తూనే సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తే సినిమా ప్రారంభానికి ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story