- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరు ఘటనపై సర్కార్ ఉక్కుపాదం..చట్టం ఎవరినీ కాపాడదన్న మంత్రి నారా లోకేష్
గుంటూరులో మహిళపై దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. నిందితుడి అరెస్ట్, ప్రమేయం ఉన్న టీడీపీ నేత సస్పెన్షన్, నిష్పక్షపాత చట్ట అమలుకు మంత్రి లోకేష్ ఆదేశం.

దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. బాధితురాలికి న్యాయం చేసే క్రమంలో అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తి అధికార తెలుగుదేశం పార్టీకి (TDP) చెందిన నాయకుడని తేలిన వెంటనే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ అతడిని పదవుల నుంచి తక్షణమే సస్పెండ్ చేసింది. పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం: మంత్రి నారా లోకేష్
సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ భయంకర ఉదంతంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "రాజకీయ అండ- పార్టీ అనుబంధం చట్టం నుంచి ఎవరినీ కాపాడలేదని స్పష్టం చేశారు. మహిళలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిందితులు ఎవరైనా సరే చట్టం ముందు సమానమే" అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మరోవైపు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ఈ వ్యవహారంపై అత్యంత వేగంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూనే.. దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా సంబంధిత పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హోం మంత్రి స్పష్టం చేశారు.






