- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం పనుల పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
by Vemula.Srinu Prasad |
: కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు ఘనమైన చరిత్ర ఉందని గుర్తు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు ఘనమైన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 12 నెలల్లో పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. నదులన్నీ అనుసంధానం చేసి కరువు లేకుండా చేస్తామని తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టిచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.
Next Story






