- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ ప్రాణం కాపాడిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది..
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయిన ఓ మహిళను గొల్లపల్లి పోలీసులు సకాలంలో స్పందించి సురక్షితంగా కాపాడారు.

దిశ, గొల్లపల్లి: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయిన ఓ మహిళను గొల్లపల్లి పోలీసులు సకాలంలో స్పందించి సురక్షితంగా కాపాడారు. ఈ వేగవంతమైన స్పందనతో ఒక ప్రాణాన్ని నిలిపిన బ్లూ కోల్ట్స్ హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, కానిస్టేబుల్ రవి లను ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం (నిన్న) రాత్రి సుమారు 10 గంటల సమయంలో శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తతో గొడవపడి, తీవ్ర మనస్తాపంతో "చనిపోతాను" అంటూ ఏడుస్తూ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆమె గ్రామ శివారులోని కాలువ వైపు నడుచుకుంటూ వెళ్తుండటాన్ని స్థానికులు గమనించి వెంటనే 'డయల్-100'కు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఆనంద్, రవి మహిళకు నచ్చజెప్పి ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా అప్పగించారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు...
"విధి నిర్వహణలో అప్రమత్తత, మానవత్వంతో స్పందించి విలువైన ప్రాణాన్ని కాపాడిన సిబ్బంది చొరవ అభినందనీయం. ఆత్మహత్యతో సమస్య పరిష్కారం కాదని, క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలకు తీరని వేదన మిగులుస్తాయని, ఎలాంటి సమస్యలున్నా ఆవేశపడకుండా ఆలోచించాలని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.






