- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్ ఆన్ వీల్స్: ఫిఫా ఫైనల్‌కు ముందే సందడి.. హైదరాబాద్‌లో ‘సాకర్ బాల్ కార్’ రయ్.. రయ్!
2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ (అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్) మ్యాచ్‌కు సమయం ఆసన్నమైన వేళ.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ విచిత్ర కార్ల (Wacky Cars) సృష్టికర్త కే. సుధాకర్ యాదవ్ సరికొత్త సంచలనానికి తెరలేపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ (అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్) మ్యాచ్‌కు సమయం ఆసన్నమైన వేళ.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ విచిత్ర కార్ల (Wacky Cars) సృష్టికర్త కే. సుధాకర్ యాదవ్ సరికొత్త సంచలనానికి తెరలేపారు. ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా చేతితో రూపొందించిన ‘సాకర్ బాల్ కార్’ (Soccer Ball Car) ను శనివారం మధ్యాహ్నం బహదూర్‌పురాలోని సుధా కార్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు.
కారు ప్రత్యేకతలు ఇవే..
సాకర్ బాల్ ఆకారంలో ఉన్న ఈ కారుపై కెనడా మ్యాపుల్ లీఫ్‌తో పాటు అధికారిక ఫిఫా (FIFA) లోగోను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆవిష్కరణ సందర్భంగా సుధాకర్ ఈ కొత్త వాహనాన్ని మ్యూజియం ప్రాంగణంలో నడిపి సందర్శకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికే మ్యూజియంలో ఉన్న ఐకానిక్ బ్లాక్ అండ్ వైట్ ఫుట్‌బాల్ కారు సరసన ఇప్పుడు ఈ కొత్త సాకర్ బాల్ కార్ కూడా చేరింది. చేతితో తయారు చేసిన వినూత్న కార్లకు ప్రపంచంలోనే ఏకైక వేదికగా గుర్తింపు పొందిన ‘సుధా కార్స్ మ్యూజియం’లో ప్రస్తుతం బర్గర్, టాయిలెట్, క్రికెట్ బాల్, వంకాయ ఆకృతిలో ఉన్న చిత్రవిచిత్రమైన కార్లు ఉన్నాయి. తాజాగా చేరిన సాకర్ బాల్ కార్ ఇక్కడి సందర్శకులకు సరికొత్త వినోదాన్ని పంచనుంది.






