- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫలించిన పాటిల్ చర్చలు.. ఒక్కటైన బండి సంజయ్, ఈటల రాజేందర్
బీజేపీ కీలక నేతలైన బండి సంజయ్ - ఈటల రాజేందర్ ల మధ్య తలెత్తిన విభేదాలు సద్దుమణిగాయి. పాటిల్ మధ్యవర్తిత్వంతో ఇద్దరూ ఒకతాటిపైకి వచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర బీజేపీలో ఇద్దరు కీలక నేతల మధ్య తలెత్తిన విభేదాలు.. పొలిటికల్ హీట్ ను పెంచాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. బీసీ నేతలు, ఎంపీలు అయిన బండి సంజయ్, ఈటల రాజేందర్ ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఇవి క్రమంగా వర్గపోరుకు దారితీసేలా ఉండటంతో.. అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయగా.. అది ఫలించింది. ఇందుకు తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ ఇల్లు వేదికైంది.
లక్ష్మణ్ ఇంట్లో ఇద్దరికీ విందు ఏర్పాటు చేయగా.. బీజేపీ జాతీయ నేత అభయ్ పాటిల్ ఈ విందుకు విచ్చేశారు. ఇద్దరు అగ్రనేతల మధ్య ఉన్న మనస్ఫర్థలపై మాట్లాడి.. వాటిని తొలగించి, ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. బండి సంజయ్ తనకు, తన వర్గంవారికి పదవులు రాకుండా చేస్తున్నారని, రాష్ట్రంలో సరిగ్గా తిరగనివ్వడంలేదని ఈటల... తన అధ్యక్ష పదవి పోవడానికి ఈటల రాజేందరే కారణమని బండి సంజయ్ లు ఆరోపణలు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఎంపీ లక్ష్మణ్ ఇంటిలో పాటిల్ తో సమావేశం తర్వాత వీరిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ మీడియా ముందుకు వచ్చారు. ఇద్దరి మధ్య హైకమాండ్ పాటిల్ తో జరిపించిన చర్చలు ఎట్టకేలకు ఫలించినట్లైంది. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీని మరింత అధికార దిశగా తీసుకెళ్లేందుకు, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇద్దరూ కలిసికట్టుగా, వ్యూహాత్మకంగా పనిచేయాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని.. పాటిల్ ఇరువురికీ సూచించినట్లు సమాచారం. కాగా.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ సీట్లు పెరుగుతాయని ఎంపీ లక్ష్మణ్.. ఈ భేటీ అనంతరం తెలిపారు.






