- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టుల భారీ డంప్
చత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టుల భారీ డంప్‌ను భద్రతా బలగాలు గుర్తించి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.

దిశ, భద్రాచలం : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా ఖాదర్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిన భారీ డంప్‌ను భద్రతా బలగాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, డంప్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలతో పాటు కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, మెడికల్ కిట్, మావోయిస్టు సాహిత్యం, ఆయుధాలు లభ్యమయ్యాయి.
స్వాధీనం చేసుకున్న సామగ్రిలో ఒక 303 రైఫిల్, ఆరు 315 రైఫిళ్లు, ఒక 12 బోర్ తుపాకీ, బీజీఎల్ (బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్), ఆర్‌ఎఫ్ డిటెక్టర్, జీపీఎస్ పరికరం, యాంటెన్నా, పెన్ డ్రైవ్‌లు, మెమరీ కార్డులు, మావోయిస్టు సాహిత్యంతో పాటు **44 బీజీఎల్ షెల్స్** ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా స్వాధీనం చేసుకున్న బీజీఎల్ షెల్స్‌ను ఘటన స్థలంలోనే నిర్వీర్యం (డీ-యాక్టివేట్) చేసినట్లు అధికారులు తెలిపారు. డంప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అది ఏ మావోయిస్టు దళానికి చెందినదనే అంశాలపై భద్రతా బలగాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.






