- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ సంగ్రామ సభకు సికింద్రాబాద్ నుంచి భారీగా తరలిన యువత..
సికింద్రాబాద్ :యువతను అన్ని రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ విమర్శించారు.

దిశ, అడ్డగుట్ట: సికింద్రాబాద్ :యువతను అన్ని రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ విమర్శించారు. బీ. ఆర్. ఎస్. పార్టీ ఆధ్వర్యంలో సరూర్ నగర్‌లో శనివారం ఉదయం యువ సంగ్రామ సభ నేపథ్యంలో సీతాఫలమండీ నుంచి సరూర్ నగర్‌కు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సీతాఫలమండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఈ ర్యాలీని పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు తగిన స్వాంతనను కలిగించాల్సి ఉందని అన్నారు. బీఆర్ఎస్ యువ నేతలు కిశోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యువ నేత రామేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అడ్డగుట్ట, నార్త్ లాలగూడా, తార్నాక, మెట్టుగూడ, చిలకలగూడ, సీతాఫలమండీ, బౌద్దనగర్, లాలాపేట వార్డుల నుంచి భారీగా బీఆర్ఎస్ యువజన విభాగం, విద్యార్ధి విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు.






