- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన ‘కమిటీ కుర్రోళ్లు’.. పుష్ప-2కి జాతీయ అవార్డుల పంట!
ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో, యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. 2024 క్యాలెండర్ సంవత్సరంలో సెన్సార్ (CBFC) పూర్తి చేసుకున్న చిత్రాలకు గాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ అవార్డులను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో ఫీచర్, నాన్-ఫీచర్, సినిమా రచన విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి:
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ తమిళ చిత్రం: రాయన్
ఉత్తమ మలయాళ చిత్రం: పెమినిచి ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం: మిథ్య
ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్
ఇతర కేటగిరీలు
ఉత్తమ సంగీతం: జీవీ ప్రకాష్ (అమరన్)
బెస్ట్ మేకప్ : పి. రవి కుమార్ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా: దీప్తీ నూర్, శీతల్ శర్మ (పుష్ప 2)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ : నితిన్ జిహానీ (కల్కి)
బెస్ట్ స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ : వెంకీ (లక్కీ భాస్కర్)
బెస్ట్ స్క్రీన్ ప్లే, రైటర్ : సుకుమార్ (పుష్ప-2)
ఉత్తమ స్క్రీన్ ప్లే: సుకుమార్ (పుష్ప-2)
చైల్డ్ ఆర్టిస్ట్: పోతుల అరుణ్ దేవ్ (35 చిన్నకథ కాదు)
ఉత్తమ నటులు..
ఉత్తమ నటి -యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ నటుడు ఇద్దరికి- మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్
ఉత్తమ సహాయనటుడు: సంజయ్ మిశ్రా
నాన్-ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ డాక్యుమెంటరీ: రామ్ నమీ
ఉత్తమ దర్శకత్వం: ఆనంద్ రాయ్ (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)
ఉత్తమ స్క్రిప్ట్: ఫరాజ్ అలీ (ఓబుర్ - హిందీ & కాశ్మీరీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: లైవ్ ఇన్ లూమ్
ఉత్తమ వాయిస్ ఓవర్/నరేటర్: సౌందర్య జయచంద్రన్ (లిటిల్ ప్లానెట్: ఏ టేల్ ఆఫ్ ఫ్రాగ్స్)
స్పెషల్ మెన్షన్: భద్ర-కాళి నాటకం (మలయాళం - డైరెక్టర్: ఆనంద జ్యోతి), చోళ దొర ఔర్ సూయీ (హిందీ - డైరెక్టర్లు: జైమిన్ మోడీ, లోకేష్ ఘాయ్).
ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్: సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)
ఉత్తమ సినిమా పుస్తకం: నానిరువూదె నిమగాగి నాడిరువూదె ననగాగి (కన్నడ) - (రచయిత: కంచనూరు ప్రదీప్ కుమార్ శెట్టి).






