72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ : ఉత్తమ నటీనటులు వీరే

by Naga Rani Yarlagadda |

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) విజేతలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ : ఉత్తమ నటీనటులు వీరే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) విజేతలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాల వారిగా అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో ఇప్పటికే పుష్ప -2 సినిమాకు రెండు అవార్డులు రాగా.. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపికైంది. ఆర్టికల్ 370లో నటనకు గాను యామీ గౌతమ్ కు ఉత్తమ నటి అవార్డు దక్కింది. అలాగే చందు చాంపియన్ సినిమాలో నటనకు కార్తీక్ ఆర్యన్ కు, బ్రమయుగం సినిమాలో నటనకు గాను మమ్ముట్టికి ఉత్తమ నటులుగా అవార్డులు దక్కాయి. ఇక ఉత్తమ పాపులర్ చిత్రంగా కల్కి 2898ఏడీ అవార్డు దక్కించుకుంది. ఆర్టికల్ 370కి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన శాశ్వత్ సచ్ దేవ్ ను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వరించింది. బెస్ట్ డైరెక్షన్ అవార్డు రాజ్ కుమార్ పెరియసామి (అమరన్)కి, మానస్ చౌదరికి బెస్ట్ సౌండ్ డిజైన్ అవార్డులు వచ్చాయి.

Next Story