- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట పొలానికి వెళ్లిన రైతు అదృశ్యం.. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు
by Taduka Kalyani |
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని గాజులపాడ్ గ్రామానికి చెందిన రైతు మక్త రమేష్ (45), తండ్రి పండరీరావు శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు.

X
దిశ, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని గాజులపాడ్ గ్రామానికి చెందిన రైతు మక్త రమేష్ (45), తండ్రి పండరీరావు శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన పంట పొలంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు సోలార్ ప్యానెల్ కోసం తన పంట పొలాల పరిసర ప్రాంతాల్లో వెతకడానికి వెళ్లిన రమేష్ అనంతరం ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం నుంచి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గ్రామంతో పాటు సమీప ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన భార్య కుశల బాయి శనివారం కంగ్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, రైతు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






