ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

by Kodari Anjali |

ధర్మారం మండల కేంద్రంలో, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డ వంశీకృష్ణ పర్యటించారు.

ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
X

దిశ, ధర్మారం: ధర్మారం మండల కేంద్రంలో, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డ వంశీకృష్ణ పర్యటించారు. మొదటగా ఎంపీ నిధులతో మండల కేంద్రంలో, ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డుతోపాటు మరో ఐదు లక్షలతో నిర్మించిన డ్రైనేజీని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నాలుగు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన రెండు బోర్ వేల్స్ ను ఆయన ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన ఎంపీకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం పలువురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. జై శ్రీరామ్ అనే నినాదాన్ని అడ్డుపెట్టుకొని బీజెపి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాల్లో చోరీ జరుగుతే, తానే ఆయాలన్ని నిర్మించనని చెప్పుకున్న ప్రధానమంత్రి మోడీ ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడి పేరు చెప్పుకొని బీజేపీ చేస్తున్న రాజకీయాలను ప్రజలంతా గమనించాలని కోరారు. పార్లమెంట్ లో బిల్లుల ఆమోదం కోసం బీజేపీ అనైతిక పద్ధతుల్లో ఇతర పార్టీల ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ ఎల్లుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తూ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరును దేశ ప్రజలకు తెలియజేస్తమన్నారు.ఎంపీ వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ,రాజేశం తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.

Next Story