అనంతపల్లికి ఆర్టీసీ బస్సు సేవలు.. బస్సు నడిపి ప్రజల్లో ఉత్సాహం నింపిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

by Kodari Anjali |

అనంతపల్లి గ్రామంలో కొత్త ఆర్టీసీ బస్సు సేవలను చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం ప్రారంభించారు.

అనంతపల్లికి ఆర్టీసీ బస్సు సేవలు.. బస్సు నడిపి ప్రజల్లో ఉత్సాహం నింపిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
X

దిశ, కొడిమ్యాల: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో కొత్త ఆర్టీసీ బస్సు సేవలను చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం ప్రారంభించారు. జెండా ఊపి బస్సును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడిపి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే, వారి సమస్యలు, రవాణా అవసరాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రవాణా సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సత్యం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఆర్టీసీ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story