- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటకు వెళ్లి ఐదుగురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం
by Jakkula.Mamatha |
తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది.

X
దిశ, భద్రాచలం: తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. చేపలు వేటకు వెళ్లిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు గోదావరిలో గల్లంతు అయ్యారు. వీరిలో ఇద్దరు మృతదేహాలను వెలికి తీయగా.. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. విలీన ఎటపాక మండలం గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన లక్ష్మీ భారతి, సుశీల, మరో మహిళతో పాటు బాలరాజు, రమేష్ ఐదుగురు కలిసి గొల్లగూడెం వద్ద గోదావరిలో శనివారం ఉదయం చేపలు పట్టడానికి వెళ్లి లోతు తెలియక నీటిలో మునిగిపోయారు. సమీపంలోని వారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికి తీయగా.. గల్లంతు అయిన మరో ముగ్గురు కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎటపాక పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షిస్తున్నారు.
Next Story






