గుండెపోటుతో ఆర్ఎంపీ వైద్యుడు మృతి

by Jakkula.Mamatha |

కేటీదొడ్డి మండలం పాతపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వినయ్ కుమార్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారని గ్రామస్తులు తెలిపారు.

గుండెపోటుతో ఆర్ఎంపీ వైద్యుడు మృతి
X

దిశ, కేటీదొడ్డి: కేటీదొడ్డి మండలం పాతపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వినయ్ కుమార్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందిన ఆయన ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story