దుబ్బగూడెం గ్రామంలో వ్యక్తి దారుణ హత్య

by Jakkula.Mamatha |

ములుగు జిల్లా వాజేడు మండలంలోని కడెకల్ సమీపంలోని దుబ్బగూడెం గ్రామంలో తెల్లవారుజామున దారుణ హత్య చోటు చేసుకుంది.

దుబ్బగూడెం గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, వెంకటాపురం(నూగురు): ములుగు జిల్లా వాజేడు మండలంలోని కడెకల్ సమీపంలోని దుబ్బగూడెం గ్రామంలో తెల్లవారుజామున దారుణ హత్య చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడే చలపతి(35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో వేట కొడవలితో మెడ పై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. హత్యకు వ్యక్తిగత కక్షలు లేక పాత విభేదాలే కారణమా లేక మరేదైనా కోణం ఉందా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేకంగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story