- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరిత్ర సృష్టించిన స్కైరూట్.. నింగిలోకి దూసుకెళ్లిన దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1
శ్రీహరికోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన దేశపు తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1'.. సాంకేతిక లోపం అధిగమించి మధ్యాహ్నం 12:05కు విజయవంతంగా లాంచ్!

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ.. విక్రమ్ -1 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోట నుంచి నింగిలోకి దుసుకెళ్లాల్సాల్సీ ఉండగా.. అయితే కౌంట్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో లాంచ్ కు ఐదు నిమిషాల ముందు సాంకేతిక సమస్యను గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి ప్రయోగం వాయిదా వేసినట్లు ప్రకటించారు. అనంతరం సమస్యను గుర్తించి సాల్వ్ చేసిన శాస్త్రవేత్తలు ఐదు నిమిషాల ఆలస్యం తర్వాత మరోసారి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. దీంతో 12.05 నిమిషాలకు విక్రమ్-1 రాకేట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది.
నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లిన విక్రమ్-1.. తన ప్రయాణంలో భాగంగా మొదట నిర్దేశిత మొదటి దశను (First Stage) విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో దశలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అత్యంత కీలకమైన రెండో దశ, మూడ, కీలకమైన నాలుగో దశను కూడా విజయవంతంగా ముగించుకుని, నిశ్చయించిన కక్ష్య వైపుగా అంతరిక్షంలోకి (Space) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రయోగం ఆశించిన రీతిలో విజయవంతం కావడంతో శ్రీహరికోట కంట్రోల్ రూమ్‌లోని స్కైరూట్, ఇస్రో శాస్త్రవేత్తలు హర్షధ్వానాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.






