కేంద్ర మంత్రికి సర్పంచ్‌ల వినతి

by Jakkula.Mamatha |

తంగళ్ళపల్లిలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు సర్పంచులు వినతిపత్రాలు సమర్పించారు.

కేంద్ర మంత్రికి సర్పంచ్‌ల వినతి
X

దిశ, తంగళ్లపల్లి: తంగళ్ళపల్లిలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు సర్పంచులు వినతిపత్రాలు సమర్పించారు. బస్వాపూర్ గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైల్వే స్టేషన్‌కు బస్వాపూర్ పేరుతోనే నామకరణం చేయాలని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ పూర్మని రాజశేఖర్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. చిన్న లింగాపూర్ రైల్వే స్టేషన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారని, అయితే బస్వాపూర్ గ్రామ సరిహద్దులు రైల్వే స్టేషన్ ఏర్పాటు అవుతున్నందున బస్వాపూర్ రైల్వే స్టేషన్ గానే పరిగణించాలని కోరారు.

అలాగే సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తంగళ్ళపల్లి మండలంలోని గ్రామపంచాయతీల నుండి సీసీ చార్జీలను చెల్లించాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి వినతి పత్రం సమర్పించారు. సీసీ చార్జీల చెల్లింపు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి కాకుండా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు లేదా ప్రత్యేక నిధులు మంజూరు చేసి చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని, ఇంటి అనుమతి ఇన్విటేషన్ సంబంధించిన నిధులు విడుదల చేయాలని, ఇంటి పన్ను అమలు చేసిన సాధారణ నిధుల నుండి నిధుల చెక్కులను వెంటనే తీసుకునే వెసులుబాటు కల్పించాలని, సీనరేజీ నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

Next Story