విడాకులైనా వదలని కానిస్టేబుల్.. మాజీ భార్య ఇంటి వద్ద హల్ చల్

by Prasad Jukanti |

తన మాజీ భార్య ఇంటి వద్ద ఓ కానిస్టేబుల్ హల్ చల్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

విడాకులైనా వదలని కానిస్టేబుల్.. మాజీ భార్య ఇంటి వద్ద హల్ చల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం మత్తులో మాజీ భార్య ఇంటి వద్ద ఓ కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఈ ఘనటలో బాధితురాలు ప్రవీణ చెప్పిన వివరాల ప్రకారం.. హాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పెద్ది కార్తీక్‌తో తనకు 2007లో ప్రవీణ వివాహం జరిగిందని ఆ తర్వాత మాకు 2023లో విడాకులు అయ్యాయని చెప్పారు. విడాకులు వచ్చినా ఆస్తి పత్రాల కోసం కార్తీక్ తమను నిత్యం వేధిస్తున్నాడని ఆరోపించింది. ఆస్తి కాగితాలు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తూ.. మంచిర్యాల కాలేజీ రోడ్‌లో ఉన్న తన ఇంటిపైకి కత్తులతో దాడికి వచ్చాడని పేర్కొంది. అతడితో పాటు వచ్చిన ఇద్దరు మహిళలు కూడా తన జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా దాడి చేశారని బాధితురాలు కంటతడి పెట్టుకుంది. తాను ఎక్కడికి వెళ్లినా కార్తీక్ తన మనుషులతో నిఘా పెడుతున్నాడని, పిల్లలను, నన్ను బ్రతకనిచ్చేలా లేడని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా తమకు న్యాయం జరగడం లేదని, కానిస్టేబుల్ కార్తీక్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు డిమాండ్ చేసింది.

Next Story