- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిర్యాణీలో కలకలం.. మహిళపై గొడ్డలితో హత్యాయత్నం, పరిస్థితి విషమం!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో వరుస హత్యతో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో వరుస హత్యతో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం రెబ్బెన మండలంలోని నారాయణపూర్ కు చెందిన వేమునూరి స్వామిని సమీప బంధువులు ఓ అమ్మాయి ఇంటి నుంచి పారిపోవడానికి సహకరించడానే అనుమానంతో అమ్మాయి బంధువులు కత్తితో పొడిచిన హత్య చేశారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని పర్సనంబాల గ్రామానికి చెందిన సోమయ్య అనే వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చారు.
తాజాగా నిన్న రాత్రి తిర్యాణి మండలంలోని తలండి గ్రామానికి చెందిన కుర్సెంగా జ్యోతి అనే మహిళ పై ఆమెకు అన్న వరసైన టేకం తిరుపతి గొడ్డలితో దాడి చేశారు. ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తిన క్రమంలో ఆవేశానికి లోనైన తిరుపతి ఇంట్లోని గొడ్డలితో జ్యోతి పై విచక్షణ రహితంగా దాడి చేయగా స్థానికులు గమనించి ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండటంతో మంచిర్యాల నుంచి వరంగల్ తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇద్దరి మధ్య గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో రెబ్బెన సర్కిల్‌లో రెండు వరుస హత్యలు. ఈ హత్యాయత్నం నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.






