ప్రమాదకర గుంతలతో ప్రయాణికులకు ఇబ్బందులు

by Jakkula.Mamatha |

వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమల గ్రామానికి సమీపంలోని రాపల్లి వాగుపై నిర్మించిన బ్రిడ్జి వద్ద రెండు వైపులా రోడ్డు గుంతల మాయమైంది.

ప్రమాదకర గుంతలతో ప్రయాణికులకు ఇబ్బందులు
X

దిశ, ఎల్లారెడ్డిపేట: వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమల గ్రామానికి సమీపంలోని రాపల్లి వాగుపై నిర్మించిన బ్రిడ్జి వద్ద రెండు వైపులా రోడ్డు గుంతల మాయమైంది. రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆయా గ్రామాలకు వెళ్లి వాహనదారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆపరేషన్ చేసుకున్న వారు ఈ రహదారిపై వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ సంబంధిత మండల అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని రెండు మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నుంచి వీర్నపల్లి మండల కేంద్రానికి అటవీ గ్రామాలకు ఈ ప్రధాన రహదారి గుండానే వాహనదారులు ప్రజలు 24 గంటలు రాకపోకలను కొనసాగిస్తున్నారు.

ఈ రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన ప్రమాదకర గుంతలు పూడ్చాలని వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు కోరుతున్నారు. ఈ రోడ్డు వెంట పాదాచారులు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలు పూడ్చి వేయించాలని స్థానికులు కోరుతున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి గుంతలో నీరు చేరి రోడ్డు పూర్తిగా బురదమయంగా మారి వాహనదారులకు ఇబ్బందికరంగా ఈ రోడ్డు మార్గం నరకప్రాయంగా ఉందని మండలాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డును త్వరితగతిన నిధులు మంజూరు చేసి ఉన్నతాధికారులు ఆయా గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు రోడ్డుకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story