- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనమ్‍ను తరలింపు.. నిరాహార దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే
సోనమ్ వాంగ్‌చుక్ తరలింపును నిరసిస్తూ సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే దీక్షకు దిగారు. జూలై 20న పార్లమెంట్ ముట్టడి యథాతథమని స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను శనివారం ఉదయం ఢిల్లీ పోలీసులు బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాంగ్‌చుక్‌ను తరలించిన వెంటనే రంగంలోకి దిగిన సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ తరలింపునకు నిరసనగా తాను ఇప్పటి నుంచే నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు దీప్కే ప్రకటించారు.
ఉద్యమం ఆగదు:
మా ఉద్యమం ఆగదని ఈ నెల 20వ తేదీన పార్లమెంట్ ముట్టడి చేసి తీరుతామని అభిజిత్ స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్‍చుక్‍ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని.. జంతర్ మంతర్‍కు వెళ్తుండగా పోలీసులు నాపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు ఆర్ఎస్ఎస్ గుండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎవరూ వెనక్కి తగ్గవద్దని ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందన్నారు. అందరూ జంతర్ మంతర్ వద్దకు తరలిరావాలని కోరారు. మా నిరసన ఇక్కడి నుంచే కొనసాగుతుందని ముందుగా ప్రకటించినట్లుగా జూలై 20న చేపట్టే మార్చ్ యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని ఆయన నొక్కి చెప్పారు.






