ప్రియాంక చోప్రా బర్త్‌డే స్పెషల్.. 'వారణాసి' నుంచి రెండు కొత్త పోస్టర్లు విడుదల

by Pulgam srinivas |   (  Updated:2026-07-18 05:16:42  IST  )

ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా 'వారణాసి' మేకర్స్ రెండు కొత్త పోస్టర్లను విడుదల చేశారు.

ప్రియాంక చోప్రా బర్త్‌డే స్పెషల్.. వారణాసి నుంచి రెండు కొత్త పోస్టర్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి'లో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం ఈ సినిమా నుంచి ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అందులో ఆమె పసుపు రంగు చీరలో, చేతిలో గన్ పట్టుకుని కనిపించగా, ఆ పోస్టర్ అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన ఎలాంటి పోస్టర్‌ను విడుదల చేయలేదు. అయితే ఈరోజు ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రెండు కొత్త పోస్టర్లను విడుదల చేసింది.

మొదటి పోస్టర్‌లో ప్రియాంక చోప్రా ప్రకృతి ఒడిలో ఉల్లాసంగా గాల్లోకి ఎగిరిన క్షణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించారు. వెనుకన కనిపించే పర్వత శ్రేణులు, మైదానంలో సంచరిస్తున్న జీబ్రాలు, జిరాఫీల మధ్య చిరునవ్వుతో కనిపిస్తున్న ఆమె లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక రెండో పోస్టర్‌లో ప్రియాంక చోప్రా పూర్తి భిన్నమైన స్టైలిష్ అవతారంలో దర్శనమిచ్చారు. బ్లాక్ కాస్ట్యూమ్‌లో ఇంటెన్స్ లుక్, కళ్లలోని తీవ్రత, డార్క్ బ్యాక్‌డ్రాప్ కలిసి పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ రెండు పోస్టర్ల ద్వారా సినిమాలో ప్రియాంక చోప్రా విభిన్న షేడ్స్‌తో కూడిన శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారనే సంకేతాలను మేకర్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story