- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేతకిలో వింత ఘటన.. ఎదురెదురుగా పిల్లి, నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం మండలంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఓ అరుదైన వింత ఘటన చోటుచేసుకుంది.

దిశ, ఝరాసంగం: దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం మండలంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఓ అరుదైన వింత ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో పొగడ చెట్టు సమీపంలో ఉన్న చండీశ్వర లింగం వద్ద అకస్మాత్తుగా నాగుపాము ప్రత్యక్షమైంది. సరిగ్గా అదే సమయంలో ఆలయంలో సంచరిస్తున్న ఓ పిల్లి ఆ నాగుపాము వద్దకు చేరుకుంది. సాధారణంగా పిల్లి, పాము ఎదురు పడితే ఒకదానిపై మరొకటి దాడికి దిగుతాయి. కానీ ఇక్కడ అందుకు పూర్తిగా భిన్నంగా జరిగింది. పాము, పిల్లి ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు.
కొద్దిసేపు ఒకదానినొకటి ప్రశాంతంగా గమనించుకున్నాయి. అనంతరం ఎవరి దారిన వారు నిశ్శబ్దంగా వెళ్లిపోయాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన అక్కడి భక్తులు వెంటనే తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వామివారి సన్నిధిలో పరస్పర విరుద్ధ స్వభావం గల జీవులు ఇలా ప్రశాంతంగా వ్యవహరించడం పట్ల భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఘటన ఉదయం జరగడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు.






