- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.. చెన్నై-మధురై హైవేపై ప్రైవేట్ స్లీపర్ బస్సు దగ్దం
చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపైప్రైవేట్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 23 మంది ప్రయాణికులు!

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో మంటలు వ్యాపించి చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. ఈ షాకింగ్ సంఘటన తమిళనాడులోని పెరంబలూర్ జిల్లా మంగళమేడు సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. చెన్నై నుండి మదురై వైపు (Chennai to Madurai) వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు.. చెన్నై-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు..
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ తక్షణమే అప్రమత్తమయ్యాడు. బస్సును హైవే పక్కన నిలిపివేసి, నిద్రపోతున్న ప్రయాణికులను త్వరత్వరగా కిందకు దించేశాడు. ప్రయాణికులందరూ బస్సు నుంచి బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సంతటా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. హైవేపై బస్సు భారీ మంటలతో తగలబడుతుండటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు.






