- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయికి చేరిన గ్రామీణ ప్రతిభ.. ఎన్ఐటీ విద్యార్థిని సన్మానించిన కాలేజీ బృందం
ప్రభుత్వ కళాశాలలో చదివి జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సంపాదించి ప్రభుత్వ కళాశాలకు పేరు తెచ్చిన విద్యార్థిని శైలజాను ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది ప్రిన్సిపాల్ సింహాచలం ఆధ్వర్యంలో శాలువా కప్పి శైలజ ఘనంగా సన్మానించారు.

దిశ, ఏన్కూర్: ప్రభుత్వ కళాశాలలో చదివి జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సంపాదించి ప్రభుత్వ కళాశాలకు పేరు తెచ్చిన విద్యార్థిని శైలజాను ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది ప్రిన్సిపాల్ సింహాచలం ఆధ్వర్యంలో శాలువా కప్పి శైలజ ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విద్యార్థి శైలజ 986 మార్కులు సాధించి కళాశాలకు పేరు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీ అయినా ఎన్ఐటి వరంగల్ లో సీటు సంపాదించి తన నైపుణ్యతను ప్రదర్శించింది.
వైరా సమీపంలోని రెబ్బవరం గ్రామానికి చెందిన శైలజ ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించి కార్పొరేట్ స్థాయి విద్యను అధిగమించి అత్యధిక మార్కులు సంపాదించడం కళాశాల గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ సింహాచలం విద్యార్థిని శైలజను అభినందించారు. ప్రభుత్వ కళాశాలలో కూడా నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకాన్ని పలువురికి కలగజేసే విధంగా విద్యార్థిని శైలజ అత్యధిక మార్కులు సాధించి ఎన్ఐటి వరంగల్ లో సీట్ సంపాదించడం కళాశాలకే గర్వకారణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.






