వనదుర్గ సేవలో హీరో మంచు విష్ణు

by Jakkula.Mamatha |

ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల వన దుర్గ భవానీ మాతను సినీ హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు.

వనదుర్గ సేవలో హీరో మంచు విష్ణు
X

దిశ,పాపన్నపేట: ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల వన దుర్గ భవానీ మాతను సినీ హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆహ్వానం మేరకు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు గాను ఆయన శనివారం మెదక్ జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయాన్ని ఆయన సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణం మరియు ప్రాంత పరిసరాలను జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ విష్ణుకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Next Story