- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర: ప్రధాని మోడీ
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర.. స్కైరూట్ ఏరోస్పేస్ నిర్మించిన తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగానికి ప్రధాని మోదీ బెస్ట్ విషెస్!

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగంపై ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ దేశీయ స్టార్టప్ సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తిగా ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఆర్బిటల్ లాంచ్ వెహికల్ 'విక్రమ్-1' (Vikram-1) రాకెట్ తొలి ప్రయోగాన్ని నేడు చేపట్టనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్కైరూట్ బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది భారత అంతరిక్ష ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని, వేగవంతమైన, డిమాండ్‌కు అనుగుణంగా ప్రయోగ సేవలు అందించేలా ఈ ఫోర్-స్టేజ్ (నాలుగు దశల) రాకెట్‌ను డిజైన్ చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
ఈ మిషన్ మన యువతలో ఉన్న ప్రతిభను, పట్టుదలను, పారిశ్రామిక స్ఫూర్తిని స్పష్టంగా చాటి చెబుతోందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు నూతన ఆవిష్కరణలకు, ప్రైవేట్ సంస్థలకు ఎలా కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయో అనడానికి ఈ ప్రయోగమే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. విక్రమ్-1 రాకెట్ అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకెళ్లి సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆకాంక్షిస్తూ.. ఈ చారిత్రాత్మక మిషన్‌ను భారతీయులందరూ, ముఖ్యంగా యువత వీక్షించాలని మరియు #IndiaWithVikram1 హ్యాష్‌ట్యాగ్ ద్వారా స్కైరూట్ టీమ్‌కు తమ మద్దతును తెలియజేయాలని దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.






