- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం
21 రోజులుగా దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు ఇవాళ ఉదయం ఆసుపత్రికి తరలించారు. కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులను అక్కడి నుంచి పంపించివేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో భాగంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‍చుక్(Sonam Wangchuk) చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇవాళ ఉదయం పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. సోనమ్ నిరాహార దీక్ష ఇవాళ్టితో 21 రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష స్థలికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే సోనమ్‍ను బలవంతంగా ఆసుపత్రికి తరలించడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాగా హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సూచనలతోనే సోనమ్ ను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు.
నిన్న బాధ్యతలు నేడు దీక్ష భగ్నం:
ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున మోహరించిన భద్రతా బలగాలు తొలుత సోనమ్ ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న ఇతర నిరసనకారులను కూడా పోలీసులు ఆ ప్రాంతం నుండి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. నిరసన స్థలంలో ఉన్న ఆందోళనకారులను పోలీసులు వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ పరిణామంతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా పెంచారు. కాగా ఢిల్లీ నూతన సీపీగా నిన్న అనురాగ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న గంటల వ్యవధిలోనే కాక్రోచ్ జనతా పార్టీ దీక్షను భగ్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు ఎల్లుండి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభోత్సవం రోజే చలో పార్లమెంట్‍కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీక్ష భగ్నం చేయడం సంచలనంగా మారింది.






