- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..'NBK 111' రిలీజ్ డేట్ వచ్చేసింది?
ప్రస్తుతం నందమూరి బాలయ్య గోపీచంద్ మలిలేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా కొనసాగుతున్న ఆయన.. ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూనే.. రాజకీయాల్లో తన పాత్ర అద్భుతంగా పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం నందమూరి బాలయ్య గోపీచంద్ మలిలేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NBK 111 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ మూవీ ఉంది. ఇలాంటి నేపథ్యంలో బిగ్ అప్డేట్ వచ్చేసింది.
డిసెంబర్ మూడో వారంలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రభాస్ చేస్తున్న ఫౌజీ సినిమా డిసెంబర్ మూడవ తేదీన రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే చిత్రం బృందం ప్రకటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత నందమూరి బాలయ్య సినిమా రిలీజ్ చేసేందుకు చిత్రం బృందం ప్లాన్ చేస్తోంది. నందమూరి బాలయ్య ఎక్కువ హిట్ టాక్ వస్తే సంక్రాంతి వరకు థియేటర్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే పోస్టర్ ద్వారా అఫీషియల్ ప్రకటన రానుంది. కాగా ఈ మూవీలో నందమూరి బాలయ్య సరసన కాజల్ నటిస్తున్నారు.






