- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు నింగిలోకి భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. హైదరాబాద్ బెస్ట్ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్ 1 రాకెట్ ను ఇవాళ ఉదయం ప్రయోగించబోతున్నారు. ఉదయం 11:30 గంటలకు శ్రీహరి కోట నుంచి రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ మిషన్ పేరు ఆగమన్ అని పెట్టారు. ఇండియాలో ప్రైవేట్ సంస్థ నిర్మించి.. ప్రయోగించబోతున్న తొలి ఆర్బిటాల్ రాకెట్ ఇదే కావడం గమనార్హం. ఈ రాకెట్ సుమారు 350 కేజీల బరువు ఉన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ లోకి తీసుకు వెళ్ళనుంది.
రాకెట్ నిర్మాణం, ప్రత్యేకతలు
ఈ ప్రైవేట్ రాకెట్ ను స్కై రూట్ ఏరోస్పేస్ స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధం చేసింది. సుమారు 7 అంతస్తుల భవనం ఎత్తు ఉండే ఈ రాకెట్ ను కార్బన్ కాంపోజిట్ తో తయారు చేశారు. ఇది ఉక్కు కంటే ఐదు రెట్లు చాలా తేలికగా ఉంటుంది. ఇందులో 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లు... అత్యాధునిక ప్రొపల్షన్ సిస్టమ్స్ అమర్చారు.






