క‌రీంన‌గ‌ర్ వ‌దిలేసి వెళ్లిపో అంటూ సీఐ టార్చర్.."హనీ ట్రాప్" కేసులో ట్విస్ట్!

by velandi.Saikiran |

కరీంనగర్ లో గత ఆరు నెలల కిందట వెలుగు చూసిన హనీ ట్రాప్ కేసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

క‌రీంన‌గ‌ర్ వ‌దిలేసి వెళ్లిపో అంటూ సీఐ టార్చర్..హనీ ట్రాప్ కేసులో ట్విస్ట్!
X

దిశ‌, వెబ్ డెస్క్: కరీంనగర్ లో గత ఆరు నెలల కిందట వెలుగు చూసిన హనీ ట్రాప్ కేసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో అమాయక పురుషులు, బడా వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లను వలవేసి.. లక్షలాది రూపాయలు వసూలు చేసిన కేసులో ఇద్దరు దంపతులను కరీంనగర్ పోలీసులు జనవరిలో అరెస్టు చేశారు. అయితే అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించగా.. దీనిపై తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. హనీ ట్రాప్ న‌కు తెర‌లేపిన లేడీ భర్త తాజాగా సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టాడు. ఇందులో త‌మ ఫ్యామిలీకి స్థానిక సీఐ పెడుతున్న టార్చర్ గురించి వివరించే ప్రయత్నం చేశాడు. హనీ ట్రాప్ కేసు నేపథ్యంలో తన ఇంటికి కూడా వెళ్ళనివ్వడం లేదని ఆరోపణలు చేశారు. త‌న కుటుంబం రోడ్డున ప‌డింద‌న్నారు. దీనిపై సీఐని ప్రశ్నిస్తే... కరీంనగర్ లో కనిపించకుండా వెళ్ళిపో అంటూ సదరు దంపతులను టార్చర్ పెట్టాడట. ఇదే విష‌యాన్ని చెబుతూ ఆ లేడీ భర్త వీడియో సోష‌ల్ మీడియాలో పెట్టారు.

తామేమి తప్పు చేయలేదంటూ వీడియో

తామేమి ఎవరిని మోసం చేయలేదని.. డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు ఎక్కడ లేవంటూ హనీ ట్రాప్ ప్రేరేపిత లేడీ భర్త షాకింగ్ నిజాలను పంచుకున్నారు. తనపై కేసు పెట్టింది ఓ బ్యాంకులో పని చేసే అధికారి అని... కానీ సీఐ మాత్రం లారీ డ్రైవర్ అంటూ మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సరే లారీ డ్రైవర్ అయినా... మీడియాకు అతడి పేరు ఎందుకు ? చెప్ప‌ లేదని నిలదీశారు. కానీ తన ఫ్యామిలీ ఫోటోలను మాత్రం బయట పెట్టి, పరువు తీసారని ఎమోషనల్ అయ్యాడు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారని ఆగ్రహించారు. అనసూయ భర్త లాగా ఉన్నానని.. కూడా చాలా మంది భయంకరమైన పోస్టులు పెట్టారని వెల్లడించారు. అటు ఓ మీడియా ప్రతినిధి కూడా తనను మోసం చేసినట్లు షాకింగ్ నిజాలను పంచుకున్నారు.

రేషన్ కార్డు, తన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు అన్నీ కూడా పోలీసుల దగ్గరే పెట్టుకున్నారని, ఎంత ప్రాధేయపడ్డ ఇవ్వడం లేదని ఎమోషనల్ అయ్యారు. రేషన్ తీసుకొని దాదాపు 7 నెలలు కావస్తోందని వెల్లడించారు. కనీసం రేషన్ కార్డు ఇచ్చినా, జీవనం కొనసాగించే వాళ్ళమని తెలిపారు. పిల్ల‌లు ఆక‌లి అంటూ ఓడ్చుస్తున్న‌ట్లు వివ‌రించారు. అయితే తాను తప్పు చేయలేదని.. కరీంనగర్ లో ఉన్న తన మిత్రులు, కస్టమర్లు ఇప్పటికీ నమ్ముతున్నారన్నారు. అందుకే ఎప్పటిలాగా తన వ్యాపారం కరీంనగర్ లో కొనసాగిస్తున్నట్లు వివరించారు. అన్యాయంగా తాను ఎవరిని మోసం చేయలేదంటూ వీడియో పెట్టారు. ఈ కేసులో అన్యాయం ఇరికించిన‌ట్లు వెల్ల‌డించారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే, దీనిపై హ్యూమ‌న్ రైట్స్ ను ఆశ్ర‌యించాల‌ని నెటిజెన్స్ సూచ‌న‌లు చేస్తున్నారు. క్లిక్

Next Story