రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌..అదంతా ఫేక్ అంటూ

by velandi.Saikiran |

రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై ఎట్టకేలకు బీసీసీఐ స్పందించింది.

రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌..అదంతా ఫేక్ అంటూ
X

దిశ‌, వెబ్ డెస్క్: రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై ఎట్టకేలకు బీసీసీఐ స్పందించింది. రోహిత్ శర్మ అభిమానులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ... వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశాలు ఉన్నట్లు హింట్ ఇచ్చింది. నిన్నటి నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డేనే రోహిత్ శర్మకు చిట్ట చివరిది అని... ఆ తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడంటూ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

అయితే ఈ ప్రచారంపై తాజాగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఎలాంటి చర్చలు జరగలేదని వెల్లడించారు. లార్డ్స్ లో జరిగే వన్డే రోహిత్ కు చివరి మ్యాచ్ కాదన్నారు. వన్డే జట్టులో ఆయన రెగ్యులర్ మెంబర్ అని తేల్చి చెప్పారు. భారత జట్టులో ఉన్నంత కాలం అతను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడన్నారు. అతడు రియల్ లెజెండ్ అంటూ కితాబు ఇచ్చారు. దీంతో రోహిత్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Next Story