- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రవాదానికి తలవంచే ప్రసక్తే లేదు.. ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా నివాళులర్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahalgam Terror Attack) జరిగిన నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధితులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘భారతదేశం ఎన్నటికీ ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదానికైనా తలవంచదు. ఉగ్రవాదుల హీనమైన కుట్రలు ఎప్పటికీ సఫలం కావు’ అని ప్రధాని మోదీ ‘X’ (ట్విట్టర్) వేదికగా ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో దేశం మొత్తం ఐక్యంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
బాధితులకు నివాళి..
గతేడాది సరిగ్గా ఇదే రోజున పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలను దేశం ఎప్పటికీ మర్చిపోదని మోదీ పేర్కొన్నారు. ‘ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నా. తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతేడాది కాలంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌లను తుదముట్టించేందుకు భద్రతా దళాలు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. పహల్గామ్ దాడి మాస్టర్‌మైండ్‌లను పట్టుకోవడంలో నిఘా వర్గాలు సాధించిన పురోగతి అనన్యసామాన్యం ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ (Zero Tolerance) విధానం కొనసాగుతుందని ప్రధాని మాటలు మరోసారి స్పష్టం చేశాయి.
పహల్గామ్ ఘటనకు ఏడాది.. మృతులకు కన్నీటి నివాళులు






