- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలనం సృష్టిస్తున్న భూభారతి స్కామ్.. జిల్లాలోనే చౌటుప్పల్ టాప్!
రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్న భూభారతి స్కాంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 1300 డాక్యుమెంట్లు గుర్తించారు.

దిశ, చౌటుప్పల్: రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్న భూభారతి స్కాంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 1300 డాక్యుమెంట్లు గుర్తించారు. దీంతో జిల్లా అధికారులు ఈ స్కామ్ కు కారణమైన వారిని గుర్తించి చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లాలో భువనగిరి ఆర్డీవోతో పాటు చౌటుప్పల్ ఆర్డీవోను విచారణ అధికారులుగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. అయితే చౌటుప్పల్ మండలంలో భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుండడంతో సుమారు 400కు పైగా డాక్యుమెంట్లు ఈ తరహా మోసానికి గురైనట్లు తెలుస్తుంది.
జిల్లాలోనే చౌటుప్పల్ టాప్!
జిల్లాలో జరిగిన భూభారతి స్కాంలో చౌటుప్పల్ మండలంలో అత్యధిక డాక్యుమెంట్లు అయినట్లు సమాచారం. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా కొనసాగుతుండడం డాక్యుమెంట్ రైటర్లకు వరంగా మారింది. చౌటుప్పల్ పట్టణానికి చెందిన ఓ డాక్యుమెంట్ రైటర్ ద్వారానే సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన కొందరు డాక్యుమెంట్ రైటర్లకు ఈ సహాయం చేసినట్లు తెలుస్తుంది. చౌటుప్పల్ లో ఒక్క డాక్యుమెంట్ రైటరే సుమారు 300 డాక్యుమెంట్లలో ఈ తరహా మోసానికి గురి చేసినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం డాక్యుమెంట్లలో సుమారు కోటి రూపాయలకు పైగానే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు సమాచారం. చౌటుప్పల్ కు చెందిన డాక్యుమెంట్ రైటర్ కూడా కొన్ని డాక్యుమెంట్లు స్లాట్లు బుక్ చేసి నారాయణపూర్ మండలానికి పంపినట్లు సమాచారం.
READ MORE .....






