- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ ఖాన్ కొత్త లుక్ వైరల్.. ఆవేదన వ్యక్తం చేస్తున్న అభిమానులు
ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోవడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోవడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైరల్ గా మారిన ఓ వీడియోలో సల్మాన్ ఖాన్ పుర్తిగా వీక్ గా మారిపోయాడు. కండలు తిరిగిన శరీరంతో ఉన్న ఆయన ఒక్కసారిగా అలా ఎలా అయిపోయారని ఫ్యాన్ ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో విషయానికి వస్తే, నెటిజన్లు, అభిమానుల మధ్య దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని వయసు సహజ ప్రభావంగా భావిస్తుండగా, మరికొందరు ఆయన రాబోయే కొత్త సినిమా కోసం తీసుకున్న ప్రత్యేకమైన మేకోవర్ (Look) అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే, సల్మాన్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉన్నట్లు గానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి, అధికారిక పిఆర్ (PR) బృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమా పరిశ్రమలో నటులు తాము చేసే పాత్రల డిమాండ్ మేరకు బరువు పెరగడం, తగ్గడం, భిన్నమైన గెటప్‌లలో కనిపించడం సహజం. కాబట్టి, సామాజిక మాధ్యమాలలో వచ్చే ఇలాంటి ఊహాగానాలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు భావిస్తున్నారు.






