సైబర్ మోసాలపై బిగ్ అలర్ట్... కర్నూలు ఎస్పీ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు...

సైబర్ మోసాలపై బిగ్ అలర్ట్... కర్నూలు ఎస్పీ కీలక ప్రకటన
X

దిశ, కర్నూలు ప్రతినిధి : సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు విద్యార్థుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని నకిలీ లింకులు పంపి మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హత వివరాలు, నగదు జమ తదితర అంశాల పేరుతో వాట్సాప్, ఎస్ఎంఎస్ గానీ సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేసి మోసపోవదన్నారు.

అలాంటి లింకుల ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఓటీపీలు, పాస్‌ వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వేదికలు, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు కార్యాలయాలను గానీ సంబంధిత అధికారులను మాత్రమే సంప్రదించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని చేయాలని విజ్ఞప్తి చేశారు.

Next Story